Louis braille biography in telugu language wiki


 లూయిస్ బ్రెయిలీ జీవిత చరిత్ర

ఇతను  అంధులు స్పర్శజ్ఞానంతో చదివేందుకు, మరియు రాసేందుకు ఒక లిపిని తయారు చేశాడు.
ఇతను రూపొందించిన లిపి బాగా ప్రాచుర్యం పొందటంతో ఈ లిపికి బ్రెయిలీ లిపిగా పేరు వచ్చింది.

  • పేరు: లూయిస్ బ్రెయిలీ (Louis Braille)
  • జననం: 4 జనవరి 1809
  • జన్మస్థానం: పారిస్ కు 20 మైళ్ళ దూరంలోని కూప్ వ్రే (Coupvray)
  • తల్లిదండ్రులు: మోనిక్‌ బ్రెయిలీ, సైమన్‌ రెనె బ్రెయిలీ
  • కంటి చూపు: మూడేళ్ల వయసులో అతని కంటికి గాయం కావడం వల్ల చూపు కోల్పోయాడు.
  • చదువు: ఏడేళ్ళ వయసు వరకు స్థానిక పాఠశాలలోనే చదివాడు. ఐతే కంటిచూపు పూర్తిగా కోల్పోయిన బ్రెయిలీ పది సంవత్సరాల వయసులో వాలెంటైన్‌ హ్యూ చేత 1784 లో పారిస్‌లో ప్రారంభించబడిన రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్‌లో చేరాడు. ఇది అంధ పిల్లల కోసం స్థాపించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి పాఠశాల.
ఈ పాఠశాలలో ఆనాడు అమలులో ఉన్న లైన్‌ టైపు పద్ధతిలో చదువుకున్నాడు.
  • వృత్తి: బ్రెయిలీ చదువుకున్న రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్‌ పాఠశాలలోనే 17వ ఏట ఉపాధ్యాయుడయ్యారు. ఆ విధంగా అంధుల పాఠశాలలో ప్రప్రథమ అంధ టీచర్ గా గుర్తింపు పొందారు. ఈయన సంగీతకారుడు కూడా.
  • మరణం: 6 జనవరి 1852 లో క్షయవ్యాధితో పారిస్ మరణించాడు.

బ్రెయిలీ లిపి:
  • స్పెయిన్‌ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్‌ 16 వ శతాబ్దంలో చెక్కమీద ఎత్తుగా ఉబ్బివుండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొందించాడు.  
  • 1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి, తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు.
  • దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను 06 చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను అంధులు స్పర్శజ్ఞానంతో చదివేందుకు, మరియు రాసేందుకు ఒక లిపిని తయారు చేశాడు.

బ్రెయిలీ ఆంగ్ల అక్షరాల చార్టు:

బ్రెయిలీ ఆంగ్ల అక్షరాల చార్టు


మరికొన్ని అంశాలు:
  • బ్రెయిలీ 200 జన్మ దినోత్సవం సందర్భంగా భారతదేశం బ్రెయిలీ గౌరవార్థం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో 2009 లో విడుదల చేసింది.
  • లూయిస్ బ్రెయిలీ జన్మదినం అయిన జనవరి 4 ను ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం (World Braille Day) గా జరుపుకుంటారు. 

వీటిని కూడా చూడండీ: